top of page

2025: 9 ఏళ్ల తర్వాత టాప్-2లోకి.. ప్లే ఆఫ్స్ లో బెంగళూరు రికార్డు

ఐపీఎల్ 2025 సీజన్ ఆరంభం నుంచి ఆర్సీబీ అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించి పాయింట్ల పట్టికలో టాప్-2లో నిలిచింది. అన్ని విభాగాల్లో దుర్భేద్యంగా కనిపిస్తోన్న బెంగళూరు ఈ సారి ఎలాగైనా టైటిల్ సాధించాలనే పట్టుదలతో ఉంది.

image.png

ప్రతి ఐపీఎల్ (IPL) సీజన్ ఆరంభంలో ఆర్సీబీ అభిమానుల నోటి నుంచి ఎక్కువగా వినిపించే మాట.. 'ఈసాలా కప్ నమదే' (ఈసారి కప్ మనదే). ఈ సారి ఆ కల నెరవేరే అవకాశముంది.
ఐపీఎల్ 2025కు ముందు జట్టులో భారీ మార్పులు చేసిన ఆర్సీబీ (Royal Challengers Bengaluru). . అన్ని విభాగాల్లో దుర్భేద్యంగా తయారైంది. లీగ్ ఆరంభం నుంచే మేటి జట్లకు షాకిస్తూ వరుసగా విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో టాప్-2లో నిలిచింది. తొమ్మిదేళ్ల తర్వాత బెంగళూరు క్వాలిఫయర్-1కు అర్హత సాధించడం విశేషం. మునుపెన్నడూ లేనంత విధంగా బలంగా కనిపిస్తోన్న బెంగళూరు ఈ సారి టైటిల్ కరవును తీర్చుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఫైనల్ చేరడానికి రెండు అవకాశాలుండటం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. మరి ఇప్పటివరకు ఆర్సీబీ ఎన్నిసార్లు ప్లే ఆఫ్స్ చేరింది, ఎలాంటి ప్రదర్శన చేసిందో ఓ లుక్కేద్దాం.

bottom of page