top of page
123.png

ఆంధ్రప్రదేశ్

ఏపీలో ప్రారంభమైన గ్రూప్-1 ప్రదాన పరీక్షలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్-1 (2023) ప్రధాన పరీక్షలు ప్రారంభమయ్యాయి. విశాఖ, విజయవాడ, తిరుపతి, అనంతపురంలోని 13 పరీక్ష కేంద్రాల్లో మొత్తం 4,496 మంది అభ్యర్థులు ఈ పరీక్షలు రాస్తున్నారు. నేటి నుంచి ఈ నెల 9 వరకు ప్రధాన పరీక్షలు జరుగుతాయి. పరీక్షా కేంద్రాలను ఏపీపీఎస్సీ ఛైర్మన్ అనురాధ, కార్యదర్శి రాజాబాబు తనిఖీ చేశారు. ట్యాబ్ ద్వారా అభ్యర్థులకు ప్రశ్నాపత్రాలు అందజేస్తున్నట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి రాజాబాబు తెలిపారు. 87 శాతం మంది అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారని చెప్పారు.
విశాఖలో 1,190, విజయవాడలో 1,801, తిరుపతిలో 911, అనంతపురంలో 594 మంది చొప్పున అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. రోజూ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఇవి ఉంటాయి. పరీక్ష నిర్వహణ సమయం ముగిసే వరకు అభ్యర్థులను బయటకు పంపించరు. ఉదయం 8.30 నుంచి 9.30 గంటల్లోగా నిర్దేశించిన పరీక్షా కేంద్రాల్లోకి అభ్యర్థులు వెళ్లాలి. ఆలస్యమైతే సహేతుక కారణాలు చూపితే 9.45 వరకూ అనుమతిస్తారు. ఆ తర్వాత వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు. గుర్తింపు కార్డు వెంట తెచ్చుకోవాలి.

bottom of page